bollywood actor story

ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ దక్షిణాదిలో విజయవంతమైన చిత్రాలను బాలీవుడ్‌లో నిర్మాతగా రీమేక్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తెలుగు చిత్రం ‘విక్రమార్కుడు’ను ‘రౌడీ రాథోడ్‌’గా, తమిళ చిత్రం ‘రమణ’ను ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ పేరుతో హిందీలో నిర్మించి విజయాన్నందుకున్నారు. తాజాగా మరో తమిళ చిత్రంపై భన్సాలీ దృష్టి పడింది. విజయ్‌ కథానాయకుడిగా మురుగదాస్‌ తెరకెక్కించిన ‘కత్తి’ సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం తెలుగులోనూ చిరంజీవి కథానాయకుడిగా ‘ఖైదీ నెంబర్‌ 150’ పేరుతో పునర్నిర్మితమై వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ‘కత్తి’ని బాలీవుడ్‌కు తీసుకెళ్లేందుకు భన్సాలీ సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ సినిమా రీమేక్‌ హక్కులను సైతం తీసుకున్నారు. ప్రధాన పాత్ర కోసం అక్షయ్‌ కుమార్‌, రణ్‌వీర్‌ సింగ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ‘రౌడీ రాథోడ్‌’, ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ చిత్రాల్లో అక్షయ్‌ కథానాయకుడిగా నటించారు. కాబట్టి ఈ మూడో రీమేక్‌ కోసం కూడా అక్షయ్‌నే ఎంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. మరో వైపు రణ్‌వీర్‌తోనూ భన్సాలీకి మంచి అనుబంధం ఉంది. ‘పద్మావత్‌’, ‘రామ్‌లీల’, ‘బాజీరావ్‌ మస్తానీ’ చిత్రాలకు వారిద్దరూ కలసి పనిచేశారు. కాబట్టి ఒకవేళ అక్షయ్‌తో కుదరని పక్షంలో బాలీవుడ్‌ ‘కత్తి’ని పట్టే అవకాశం రణ్‌వీర్‌కే దక్కుతుందని సమాచారం.

Comments

Popular posts from this blog

RAGINI MMS 3 | New Trailer | Dilnaz Irani | Trailer Official | Bollywood...